Farmers protest compensation: గతేడాది రబీలో విత్తనోత్పత్తి కోసం 130 మంది రైతులు 370 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంట ఎదుగుదల లేక దిగుబడులు పడిపోయాయి. ఎకరాకు 3 టన్నుల వరకు దిగుబడులు వస్తాయని కంపెనీ ప్రతినిధి గెడ్డం రామారావు హామీ ఇచ్చారని బాధిత రైతులు పేర్కొన్నారు. తీరా చూస్తే ఎకరాకు 100 నుంచి 150 కిలోలే రావడంతో పరిహారం వచ్చేలా చూస్తానని చెప్పారని, తీరా ఇప్పుడు మొహం చాటేశారని వాపోతున్నారు.
ఎకరాకు రూ.50వేల చొప్పున నష్ట పరిహారం అందించాలని ఆందోళనకు దిగినప్పుడు రెవెన్యూ, పోలీసు, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో కమిటీ సమావేశమై పరిహారం ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పటివరకూ నయా పైసా రాలేదని, దీంతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధపడ్డామని పేర్కొన్నారు. కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై శుభశేఖర్ వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పరిహారం ఇప్పిస్తేనే ఆందోళన విరమిస్తామని సర్పంచి సత్యం రాంపండు పేర్కొన్నారు. సంబంధిత కంపెనీ, విత్తనాలు ఇచ్చిన ప్రతినిధిపై రాతపూర్వక ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. దీంతో రైతులంతా సంతకాలు పెట్టి ఫిర్యాదును పోలీసులకు అందించారు.
ఇవీ చదవండి: