కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్న చెరువు భూముల్లో మట్టి తవ్వొద్దంటూ రైతులు ఆందోళన చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి ఊరిచెరువులో సుమారు 70ఎకరాల విస్తీర్ణంలో పలువురు రైతులు సాగు చేసుకుంటున్నారు. వీటిలో కొన్నింటికి ప్రభుత్వ పట్టాలు ఉండగా ,మరికొన్ని భూములకు ఎటువంటి పట్టాలు లేవు. ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ అధికారులు సేకరించిన భూములను మెరక చేయడం కోసం ఈ చెరువులో మట్టి తవ్వేందుకు రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు.
సుమారు రెండు వందల ఎకరాల చెరువు ఉండగా కేవలం సాగుచేస్తున్న భూమిలోనే మట్టి తవ్వటంతో సంబంధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సాగు భూముల్ని మినహాయించి మిగిలిన చెరువులో మట్టి తవ్వాలంటూ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి జూన్ 4న కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ