సినిమా షూటింగ్ కోసం వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అభిమానులు కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ఘన స్వాగతం పలికారు. గన్నారెడ్డి ఆర్మీ... మీ అల్లు అర్జున్ ఆర్మీ... జనసేన యువకులు... జై జనసేన... జై పవన్... అంటూ నినాదాలు చేశారు. బన్నీ తన కాన్వాయ్ నుంచి అందరికీ అభివాదం చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నిర్మించబోతున్న షూటింగ్ నిమిత్తం బన్నీ కాకినాడ వచ్చాడు. పది రోజుల పాటు... కాకినాడ పోర్ట్ లోని కొన్ని ప్రాంతాల్లో లో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఆకట్టుకున్న నాదస్వర కచేరీ