అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై కేసును ఎత్తి వేసి వెంటనే విడుదల చేయాలని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. రామకృష్ణారెడ్డి అరెస్టును నిరసిస్తూ కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు, పెదపళ్లలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైకాపా నేతల అక్రమాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి: రామకృష్ణారెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం: చంద్రబాబు