గిరిజన కళాకారులకు ప్రజా నాట్య మండలి అండగా ఉంటుందని సంస్థ తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మహంతి అన్నారు. రంపచోడవరంలోని సీపీఐ కార్యాలయంలో ది జాంపేట కోపరేటివ్ అర్బన్ బ్యాంకు సౌజన్యంతో గిరిజన కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
కరోనా కారణంగా ఉఫాది లేక ఇబ్బందులు పడుతున్న గిరిజన కళాకారులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని మహంతి కోరారు. ప్రజా సమస్యలను కళా రూపాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ఆంద్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ముందుందని ప్రశంసించారు. గిరిజన కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.