జాతీయ క్రీడా దినోత్సవం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఘనంగా నిర్వహంచారు. జేఎన్టీయూ వద్ద కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించిన క్రీడా ర్యాలీ....జిల్లా క్రీడా మైదానం వరకు కొనసాగింది. ఎస్పీ నయీమ్ అస్మీ, కాకినాడ ఎంపీ వంగా గీత, జేఎన్టీయూ ఉపకులపతి రామలింగేశ్వరరావు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో రాణించిన క్రీడాకారులకు పతకాలు, ప్రోత్సాహకాలు అందించారు. పాఠశాల స్థాయి నుంచే చదువుతో పాటు క్రీడలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని ఎంపీ గీత అన్నారు. జిల్లాలో ఐదున్నర కోట్లతో మైదానాలు అభివృద్ధి చేస్తామని ఎంపీ చెప్పారు.
ఇదీ చూడండి: రాజమహేంద్రవరంలో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్ ప్రారంభం