ETV Bharat / state

పింఛన్, తెల్లరేషన్‌ కార్డుల తొలగింపుపై 'స్పందన' ఏదీ..? - తెల్లరేషన్‌ కార్డులు కోల్పోయిన బాధితుల వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో స్పందన కార్యక్రమానికి పింఛను, తెల్లరేషన్‌ కార్డులు కోల్పోయిన బాధితులు వెల్లువెత్తారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ పింఛన్​పై ఆధారపడి జీవిస్తోన్న నిరుపేదలు.. అకస్మాత్తుగా పెన్షన్​​ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారంలో పునరుద్దరిస్తామని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి చెప్పినప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదని మాజీ ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు.

spandhana programme at kakinada
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్‌ స్పందన
author img

By

Published : Feb 10, 2020, 4:31 PM IST

పింఛన్ల తొలగింపుపై కాకినాడ కలెక్టరేట్​కు వినతుల వెల్లువ

పింఛను కోల్పోయిన వయో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వీరికి తెదేపా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ పింఛను​పై ఆధారపడి జీవిస్తోన్న నిరుపేదలకు అకస్మాత్తుగా పింఛన్​ తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం పింఛన్లు పునరుద్దరించాలని డిమాండ్‌ చేశారు. అయితే వారంలో పునరుద్దరిస్తామని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి చెప్పినప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందనలో కలెక్టర్‌, జేసీ లేకపోవడం వల్ల జేసీ - 2 రాజకుమారికి ఫిర్యాదు దారులు వినతులు అందజేశారు.

ఇవీ చూడండి:

'రాష్ట్రంలో రూపొందించిన దిశ చట్టం దేశానికే ఆదర్శం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.