తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. ఏకంగా ఒక్కరోజులోనే 60 కేసులు నమోదయ్యాయి. రావులపాలెం మండలం ఊబలంక, గోపాలపురం పీహెచ్ సీలో 250 పరీక్షలు నిర్వహించగా 60 పాజిటివ్ కేసులు వచ్చినట్లు పీహెచ్సీ అధికారులు దుర్గాప్రసాద్, ఇందుశ్రీలు వెల్లడించారు. ఇప్పటికే మండలంలో 68 కేసులు ఉండగా వీటితో కలిపి 128 కేసులు అయ్యాయి.
ఇదీ చూడండి