ETV Bharat / state

వైద్యశాలల్లో అరకొరగా అగ్నిమాపక వనరులు.. విజయవాడ ఘటన పాఠం నేర్పేనా!

అనుకోని ప్రమాదాలు వెంటాడుతున్నాయి.. ముందు జాగ్రత్త లేక భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి. అయినా కొన్నిచోట్ల ఉదాసీనత వీడడం లేదు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే హడావిడి చేసి ఆ తరువాత సమస్యలను విస్మరిస్తున్నారు.

east-godavari-district-officers-alert-on-fire-accidents-in-covid-hospitals
వైద్యశాలల్లో అరకొరగా అగ్నిమాపక వనరులు
author img

By

Published : Aug 10, 2020, 1:27 PM IST

విజయవాడలోని హోటల్‌ స్వర్ణాప్యాలెస్‌లో నిర్వహిస్తున్న కొవిడ్‌ కేంద్రంలో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృత్యువాత పడగా.. మరో 20 మంది గాయపడ్డారు. ఈ సంఘటన పెను విషాదాన్ని నింపింది. దీంతో అప్రమత్తమైన తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడింది. కరోనా విజృంభిస్తున్న వేళ వేలాదిగా బాధితులు ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లను, క్వారంటైన్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. వీరి భద్రతపై వారి కుటుంబీకుల్లో ఉత్కంఠ నెలకొంటోంది.

  • జిల్లాలో కొవిడ్‌ సేవలు ఎక్కడెక్కడంటే..?

కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి.. మరో 13 ప్రైవేటు ఆసుపత్రులు, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రితోపాటు ఇక్కడి మరో 7 ప్రైవేటు హాస్పిటల్స్​లో, అమలాపురంలోని ప్రాంతీయ ఆసుపత్రి, మరో ప్రైవేటు ఆసుపత్రిలో సేవలు అందుతున్నాయి. ఇవికాక రాజానగరం మండలంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాల, అమలాపురం మండల పరిధిలోని కిమ్స్‌ వైద్య కళాశాలలో కొవిడ్‌ వైద్యం అందజేస్తున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లు రాజమహేంద్రవరంలోని బొమ్మూరు టిడ్కో, కాకినాడలోని జేన్‌టీయూ, అల్లవరం మండలంలోని బోడసకుర్రు, రంపచోడవరం, చింతూరులో ఉన్నాయి.

జిల్లాలో కొవిడ్‌ సేవలకు కాకినాడలోని జీజీహెచ్‌, రాజమహేంద్రవరంలోని జిల్లా ఆసుపత్రితోపాటు.. మరో 24 నోటిఫైడ్‌ కొవిడ్‌ ఆసుపత్రులను అధికారులు గుర్తించారు. కొద్ది ప్రాంగణాల్లో మినహా మిగిలినచోట్ల అగ్నిమాపక సన్నద్ధత లేదనేది స్పష్టమవుతోంది. జిల్లాలో ప్రధాన వైద్యశాలలు 321 ఉంటే.. అందులో అగ్నిమాపక అనుమతులు కేవలం 105 ఆసుపత్రులకే ఉన్నాయని గతంలో విపత్తుల నిర్వహణ- అగ్నిమాపక సేవల శాఖ గుర్తించి తాఖీదులు జారీ చేసింది. అయినా చాలామంది స్పందించని పరిస్థితి. నిరభ్యంతర పత్రాలు లేకుండానే నిర్వహిస్తున్న వైద్యశాలలపై చర్యలు లేవు. ఇప్పుడు కొవిడ్‌ సేవలు అందిస్తున్న వైద్యశాలల్లో 12 ఆసుపత్రుల్లో అగ్నిమాపక అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. అక్కడ పరికరాలు అందుబాటులో ఉన్నా.. అవి పనిచేస్తున్నాయో లేదో అనే దానిపై స్పష్టత లేదని జిల్లా అగ్నిమాపక అధికారి రత్నబాబు తెలిపారు.

  • మేల్కొనడమే మేలు..

రాజమహేంద్రవరం గ్రామీణ మండలం బొమ్మూరులోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏపీ టిడ్కో గృహ సముదాయం (జీ+3) భవనంలో నడుస్తోంది. ఇక్కడ అధిక సంఖ్యలో బాధితులు వసతి పొందుతున్నారు. ఇక్కడ ప్రత్యేక అగ్నిమాపక పరికరాల అమరిక లేదు. లోపలికి వెళ్లే మార్గం ఇరుకుగా ఉంది. నీళ్ల ట్యాంకుల నిర్మాణం పూర్తికాలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తోంది.

అల్లవరం మండలంలోని బోడసకుర్రు ఏపీ టిడ్కో గృహ సముదాయంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ కొత్తగా ఏర్పాటుచేశారు. ఇక్కడ అగ్నిమాపక సన్నద్ధత లేదు. గ్యాస్‌ వినియోగిస్తూ కొవిడ్‌ బాధితులకు వంటలు చేస్తున్న ప్రాంగణంలో ఎలాంటి భద్రత చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చింతూరు, రంపచోడవరంలలోనూ అగ్నిమాపక సన్నద్ధత లేదు.

ప్రధాన ఆసుపత్రుల్లో ఊసేలేదు.

  • కాకినాడలోని జీజీహెచ్‌లో అగ్నిమాపక పరికరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసి అనుమతులు పొందాల్సి ఉంది. నూతనంగా అగ్నిమాపక సేవలకు పైపులైన్లతోపాటు 2 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంకు ఏర్పాటుచేసినా.. ఇతర పరికరాల ఏర్పాటు చేసి ఎన్‌వోసీ పొందాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లా కొవిడ్‌ ఆసుపత్రిగా మారిన క్రమంలో రోగుల తాకిడి ఎక్కువయింది. జీజీహెచ్‌లో 2018లో స్టోర్‌ రూమ్‌లో, 2019లో మందులు ఇచ్చే ప్రాంగణంలో అగ్నిప్రమాదాలు జరిగాయి.
  • రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో అగ్నిమాపక చర్యల ఊసే లేదు. ఆసుపత్రి జీ-1 భవనం గ్రౌండ్‌, మొదటి అంతస్తుల్లో కరోనా బాధితులు ఉంటున్నారు. అగ్నిమాపక పరికరాలు పూర్తిస్థాయిలో లేవు.
  • అమలాపురం ప్రాంతీయ ఆసుపత్రిలోని విద్యుత్తు వ్యవస్థ సరిగ్గాలేదు. కాలం చెల్లిన విద్యుత్తు తీగలు, విద్యుత్తు పరికరాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. పాడైన స్విచ్‌ బోర్డులు, వేలాడుతున్న విద్యుత్తు తీగలు ప్రమాదాలకు తావిచ్చేలా ఉన్నాయి. ఈ ఆసుపత్రిలో ప్రస్తుతం 30 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు.
  • తునిలో కొత్తగా ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటరులోనూ అగ్నిమాపక పరికరాలు లేవు.

అన్ని ప్రాంగణాల్లో తనిఖీలు..

జిల్లాలో కొవిడ్‌ వైద్యసేవలు అందిస్తున్న ప్రాంగణాలన్నింటిలోనూ నిపుణులతో తనిఖీ నిర్వహించమని ఆదేశించాం. నైపుణ్యం ఉన్న సిబ్బందితో వైరింగ్‌లు ఎలా ఉన్నాయి. అగ్నిమాపక పరికరాలు ఉన్నచోట అవి సమర్థంగా పనిచేస్తున్నాయా..? లేదా..? అనేవి తనిఖీ చేయిస్తాం. జిల్లా అగ్నిమాపక అధికారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్ల వద్ద తాత్కాలికంగా అగ్నిమాపక బృందాలను, పరికరాలను ఏర్పాటుచేశారు. - గనియా రాజకుమారి, జిల్లా సంయుక్త కలెక్టర్‌ (కొవిడ్‌ సేవల ఆసుపత్రుల పర్యవేక్షణ)

ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం

జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరంలోని జిల్లా ఆసుపత్రితోపాటు బొమ్మూరు, జేఎన్‌టీయూ కొవిడ్‌ కేర్‌ సెంటర్ల దగ్గర అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాం. జీఎస్‌ఎల్‌, కిమ్స్‌, బోడసకుర్రు ప్రాంగణాల్లో అగ్నిమాపక సిబ్బందిని పరికరాలతో అందుబాటులో ఉంచాం. - రత్నబాబు, జిల్లా అగ్నిమాపక అధికారి, కాకినాడ

రెండు వారాల క్రితమే సమీక్ష

జిల్లాలోని ఆసుపత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఇతర ప్రాంగణాల్లో అగ్నిమాపక సన్నద్ధతపై 2 వారాల క్రితమే టెలీ కాన్ఫరెన్స్‌లో అందర్నీ అప్రమత్తం చేశాం. విజయవాడలో జరిగిన ప్రమాదంతో మరోసారి అందర్నీ అప్రమత్తం చేశాం.. - డి.మురళీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌

ఇవీ చదవండి...

అవగాహన లోపం.. శాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.