కరోనా విజృంభిస్తున్న వేళ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వినూత్న కార్యక్రమం చేపట్టారు. మహనీయుల విగ్రహాలకు మాస్కులు ధరింపజేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా.. ఇప్పటికీ ఇంకా కొందరు మాస్కులు పెట్టుకోకపోవడం వల్ల మిగతా వారికి కూడా కొవిడ్ సంక్రమిస్తోందని అన్నారు.
దీనిని నివారించేందుకు అవగాహన కోసం.. కాకినాడ కలెక్టరేట్లోని మహాత్మా గాంధీ, ప్రముఖ దివింగత ఐఏఎస్ అధికారి శంకరన్ విగ్రహాలకు పూలమాల వేసి మాస్కు ధరింపజేశారు. ప్రజలు కరోనా నుంచి రక్షణ కవచంలా మాస్కు పెట్టుకోవాలనే మంచి సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇలా చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఇవీ చదవండి: