దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని తూర్పు గోదావరిజిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో దేవి సంబరాలు మెదలయ్యాయి. వేకువజాము నుంచే దుర్గాదేవి ఆలయాలకు భక్తజనం పోటెత్తారు. నియోజకవర్గ కేంద్రమైన పి.గన్నవరంతో పాటు పలు గ్రామాలలో అమ్మవారి ఉత్సవాలు అంబరాన్నంటాయి. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయాలకు చేరుకుని ప్రత్యేక, కుంకుమ పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవి మాతకు పంచామృత, దివ్య అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపారు. అమ్మవారి సేవలో భక్తులు తరిస్తున్నారు.
ఇదీ చూడండి: