ETV Bharat / state

అన్నదాతకు అకాల కష్టం.. కల్లాల్లో తడిసిన ధాన్యం - పొలాల్లో తడిసిన ధాన్యం

బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల పలు జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరపిలేని వర్షం కురిసింది. పంట కోతల సమయంలో అకాల వర్షం తమను ఇబ్బందులకు గురి చేస్తోందని రైతులు వాపోతున్నారు. గోదావరి జిల్లాల్లో ఇంకా 20 శాతం కోతలు కూడా కాలేదని అన్నదాతలు చెబుతున్నారు. కరోనా లాక్​డౌన్ వల్ల మద్దతు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో.. వర్షం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Due to rains crop losses in Ap
అన్నదాతకు అకాల కష్టం.. కల్లాల్లో తడిసిన ధాన్యం
author img

By

Published : Apr 27, 2020, 4:08 PM IST

అన్నదాతకు అకాల కష్టం.. కల్లాల్లో తడిసిన ధాన్యం

కారుమబ్బులు అన్నదాతలను పరుగులు పెట్టించాయి. కల్లాల్లో ఉన్న వరి, మిర్చి, మొక్కజొన్న పంటలపై పట్టాలు కప్పేందుకు పొలాలకు పయనమయ్యారు.

తూర్పుగోదావరి జిల్లాలో

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. కోనసీమలో సుమారు లక్షా 50 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. రబీ వరి చేలు మాసూళ్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అకాల వర్షం రైతును నిండా ముంచింది. వర్షంతో కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులు తడిసిపోవడం వల్ల వాటిని కాపాడుకునేందుకు రైతులు హైరానా పడుతున్నారు. మరో పది రోజులు వాతావరణం అనుకూలిస్తే పంట చేతికి వస్తుందని, కానీ ఇప్పుడు అకాల వర్షాలతో నష్టపోయామని అన్నదాతలు వాపోతున్నారు. వర్షాలతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో అకాలవర్షం కురిసింది. ఉదయం ఈదురుగాలులు, కారుమబ్బులతో పట్టపగలే చీకట్లు కమ్మాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో భారీ వర్షం పడింది. కర్షకులు పంటలను కాపాడుకునేందుకు కల్లాలకు పరుగులు తీశారు. పంట పొలాల్లోనే మిర్చి, మొక్కజొన్న తడిచిపోవడం వల్ల అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

ప్రకాశం జిల్లాలో

ప్రకాశం జిల్లా చినగంజాంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురిసింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఉరుములు, మెరుపులతో భారీ వాన పడింది. వర్షం వల్ల కల్లాల్లో ఎండబెట్టిన ఉప్పు కరిగిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

వానరానికి అంత్యక్రియలా?.. మరీ ఇంత జనమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.