కరోనా మహమ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పనిచేస్తున్న వైద్యులు, పారా మెడికల్, శానిటేషన్, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ తెదేపా అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్‌కుమార్, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ కళ్యాణిలకు చంద్రబాబు రాసిన లేఖలను ఎమ్మెల్యే అందించారు.
కొవిడ్ సమయంలో మానవతా దృక్పథంతో ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రజలకు అందిస్తున్న సేవలు ఆదర్శనీయమన్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న వారు.. ప్రజల హృదయాల్లో నిలిచిపోతారన్నారు. పార్టీ తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. మండపేట నియోజకవర్గంలోని సుమారు వెయ్యి మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు లేఖలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాశ్, పట్టణ తెదేపా అధ్యక్షుడు రాంబాబు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: