అనైతికంగా రాష్ట్రాన్ని విభజన చేశారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెదేపా అభ్యర్థి గొల్లపల్లి సూర్యరావు, అమలాపురం ఎంపీ అభ్యర్థి హరీష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమించి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి
లేనిపోని పొత్తులను జనసేనకు అంటగట్టకండి: పవన్