తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో పంట కాలువలో గల్లంతైన మహిళ మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఈ నెల 28న చాకలి పాలేనికి చెందిన బద్దే కుమారి పంట కాలువలో గల్లంతైంది. ఆమె మృతదేహం మంగళవారం చాకలి పాలెం వద్ద పంట కాలువలో తేలింది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పి గన్నవరం ఎస్సై జి సురేంద్ర తెలిపారు.
ఇదీ చూడండి: ప్రభుత్వ స్కీమ్‌లన్నీ స్కాంల కోసమే: చంద్రబాబు