తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన గోదావరి బోటు ప్రమాదంలో... గల్లంతైన వారి మృతదేహలు ఇంకా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జిల్లాలోని కడియం మండలం కడియపులంక గోదావరి ఒడ్డున మరొక మృతదేహం లభ్యమైంది. గుర్తు పట్టడానికి వీలు లేనంతగా మృతదేహం ఉందని పోలీసులు తెలిపారు. ఈ మృతదేహం బోటు ప్రమాదంలో గల్లంతైన వ్యక్తిదేనని పోలీసులు నిర్ధరించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు.
ఇదీ చూడండి: బోటు ప్రమాదం..వాడపల్లి వద్ద మరో మృతదేహం లభ్యం