
తూర్పు గోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని బెల్లంపూడి రేవులో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రేవు ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి పడవలో అజాగ్రత్తగా ప్రయాణిస్తున్నారు. ఈ మర పడవలలోని ప్రయాణికులంతా లైఫ్ జాకెట్లు ధరించకుండా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పైగా కరోనా నేపథ్యంలో పడవల్లో భౌతిక దూరం కూడా పాటించడం లేదు. ఈ పరిస్థితిపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇవీ చదవండి