ETV Bharat / state

యానంలో విజృంభిస్తున్న కరోనా కేసులు... మెుత్తం 2వేల మందికి పాజిటివ్ - covid 19 cases in east godavari

తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. అధికారులు తగు చర్యలు తీసుకున్నప్పటికి ఫలితం కనిపించటం లేదు. ఈ ప్రభావం జిల్లాకు సమీపంలోని కేంద్ర పాలిత ప్రాతం యానం ప్రజలపై పడుతోంది. కొత్తగా 16వేల మందికి పరీక్షలు నిర్వహించగా 2వేల మందికి పాజిటివ్ రావటంతో అధికారులు అప్రమత్తయ్యారు. కరోనా తిరిగి ప్రబలడంతో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

యానంలో విజృంభిస్తోన్న కరోనా కేసులు... కొత్తగా 2వేల మందికి పాజిటివ్

author img

By

Published : Nov 4, 2020, 12:43 PM IST

Updated : Nov 4, 2020, 2:23 PM IST

రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాలో తూర్పుగోదావరి ముందుస్థానంలో ఉంది. జిల్లాకు సమీపంలోని కేంద్ర పాలిత యానం ప్రజలపై కోవిడ్ ప్రభావం చూపుతోంది. 70 వేల జనాభా కలిగిన యానంలో 16 వేల మందికి పరీక్షలు నిర్వహించగా 2వేల మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. జూన్, జూలై నెలలో ప్రతిరోజు వందకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆగస్టు, సెప్టెంబర్​లో​ 10 లోపు కేసులు నమోదవ్వటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అక్టోబర్, నవంబర్​లో వైరస్ ఉద్ధృతి పెరిగి రోజువారి కేసుల సంఖ్య 10 నుంచి 30 వేల వరకు ఉంది. పండుగల సీజన్​తో ఈ పరిస్థితి నెలకొందని అధికారులంటున్నారు.

రెండు నెలలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి మల్లాడి

దేశవ్యాప్తంగానేకాక అనేక రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి తిరిగి పుంజుకుంటుంది. పుదుచ్చేరిలోని 4 డివిజన్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నవంబర్​లో కేసుల సంఖ్య పెరుగుతున్నందున రెండు నెలలు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జనవరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆరోగ్య శాఖ నివేదిక
10 రెవెన్యూ డివిజన్లుగా ఉన్న యానంలో ప్రతి ఒక్కరికి పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన బాధితులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రితో పాటు మరో 2 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి 24 గంటల వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉంచామన్నారు. కరోనా ఇతర అనారోగ్య సమస్యలతో 42 మంది మృతి చెందారని యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా తెలిపారు.

ఇవీ చదవండి

రహదారి ప్రమాదాలు: ఇద్దరు మృతి.. ఎనిమిది మందికి గాయాలు

Last Updated : Nov 4, 2020, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.