తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి నూతన రథం నిర్మాణ పనులను దేవదాయ శాఖ అధికారులు శనివారం రావులపాలెంలో ప్రారంభించారు. రథం నిర్మాణానికి ప్రధానమైన కలపకు వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం కోత పనులు ప్రారంభమయ్యాయి.
లక్ష్మీ నరసింహ స్వామి దివ్య రథాన్ని కళ్యాణోత్సవ సమయానికి పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ తెలిపారు.
బస్తర్ టేకుతో రథాలు తయారు చేయటం ఆనవాయితీ. ఈ టేకుతో తయారు చేస్తే రథం 91 సంవత్సరాలు మనుగడ ఉంటుంది. దీనికి కావాల్సిన అనువైన కలప రావులపాలెంలోనే ఉంది. రథం నిర్మాణానికి 1330 అడుగుల కలప అవసరమవుతుంది- రామచంద్ర మోహన్, రాష్ట్ర అసిస్టెంట్ కమిషనర్, దేవాదాయ శాఖ
ఇదీ చదవండి