ETV Bharat / state

'పది రోజుల్లో నెహ్రూ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలి' - nehru statue issue in kakinda

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో తొలగించిన నెహ్రూ విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ హెచ్చరించారు.

congress chief sailajanath
congress chief sailajanath
author img

By

Published : Dec 28, 2020, 8:15 AM IST

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సెంటర్​లో నెహ్రూ విగ్రహాన్ని తొలగించడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తొలగించిన విగ్రహాన్ని పునః ప్రతిష్టించకపోతే ఉద్యమానికి దిగుతామని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ హెచ్చరించారు. ఆదివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు.

అర్ధరాత్రి కాకినాడ నడిబొడ్డున నెహ్రూ విగ్రహాన్ని తొలగించడం అమానుష చర్యని అన్నారు. పది రోజుల్లో విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. విగ్రహాన్ని అధికారులు పెడతారా.. లేదంటే తమనే పెట్టుకోమంటారా అని ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

ఇవాళ కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.