సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తూర్పు గోదావరి కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. కాకినాడలోని కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మే 23న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యపైనే రౌండ్ల సంఖ్య ఆధారపడి ఉంటుందని చెప్పారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు అత్యధికంగా 29 రౌండ్లు అవసరమవుతాయని తెలిపారు. అత్యల్పంగా పెద్దాపురం, కాకినాడ నగరం, రాజమహేంద్రవరం నగరం, మండపేట నియోజకవర్గాల లెక్కింపు 16 రౌండ్లలోనే పూర్తవుతుందని వివరించారు. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వీవీప్యాట్లలోని స్లిప్పుల లెక్కింపు ప్రారంభిస్తామని తెలిపారు. మే 27వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విజయోత్సవ ర్యాలీలు చేయడానికి అనుమతి ఉండదన్నారు.
ఇవీ చదవండి..