ETV Bharat / state

'జొన్నాడ స్టాక్​ పాయింట్​లో తగినంత ఇసుక నిల్వ చేయాలి' - east godavari district collector latest news

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ స్టాక్​ పాయింట్​లో తగినంత ఇసుక నిల్వ చేయాలని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అన్నారు. ఈ ఏడాదిలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఇసుక ఎక్కువగా అవసరం ఉంటుందని ముందుగానే నిల్వలు పెట్టుకోవాలని సూచించారు.

collector with officials
ఇసుక ర్యాంపులో అధికారులతో కలెక్టర్​
author img

By

Published : Jun 1, 2021, 5:25 PM IST

రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగినంత ఇసుక నిల్వ చేయాలని జయప్రకాశ్​ పవర్ వెంచర్స్ కంపెనీ ప్రతినిధులను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి ఆదేశించారు. ఆలమూరు మండలం జొన్నాడ ఇసుక ర్యాంపులో నిర్వహిస్తున్న ఎగుమతులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఇసుక నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని.. స్టాక్ పాయింట్​కు ఇసుకను తరలించటంతో జాప్యం చేయకూడదని చెప్పారు.అవసరాన్ని బట్టి ఇసుక తరలింపు వాహనాల సంఖ్య పెంచాలని సూచించారు. ఈ ఏడాదిలో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ఇసుక.. ఎక్కువగా అవసరం ఉంటుందని, గృహ నిర్మాణాలు కూడా అధిక సంఖ్యలో చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వచ్చే గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఇసుకను నిల్వ చేసుకోవాలని కలెక్టర్​ తెలిపారు. 20 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసిన తర్వాతే స్థానిక అవసరాలకు ఎగుమతులు జరపాలని అన్నారు. ఇసుక ర్యాంప్ వద్ద ఎటువంటి అల్లర్లు సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కలెక్టర్ వెంట రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి, అడిషనల్ ఎస్పీ సుమిత్ గరుడ్, రామచంద్రాపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, మైనింగ్ శాఖ డీడీ రాజేశ్​, ఆలమూరు తహసీల్దార్ లక్ష్మీపతి, ఎస్సై ఎస్.శివప్రసాద్, ఆర్ఐ జానకి రాఘవ, మైనింగ్ ఆర్ఐ శ్రీనివాస్, ఏజీ శ్రీనివాస్, టీఏ హరీశ్​ పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి విశ్వరూప్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.