తూర్పుగోదావరి జిల్లాలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జిల్లాలో అంతర్భాగంగా ఉన్న పుదుచ్చేరి రాష్ట్రానికి చెందిన యానాంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నియంత్రణ నిర్వహణ ప్రత్యేక అధికారి లక్ష్మీ నారాయణ రెడ్డి... డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా నేతృత్వంలో పోలీస్ సిబ్బంది యానాం ప్రవేశించే మార్గాలన్నింటినీ మూసివేశారు. అనుమానిత వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వే నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. యాంటీబ్యాక్టీరియల్ ద్రావణం పిచికారి చేస్తున్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు