రాష్ట్రంలో కరోనా సందర్భంగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను నిలిపివేయాడాన్ని వ్యతిరేకిస్తూ కాకినాడ కలెక్టరేట్, డీఆర్డీఏ కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా నిర్వహించింది. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో భవననిర్మాణ రంగంపై ఆధారపడి 5 లక్షల మంది జీవనం సాగిస్తున్నారని. వీరు సంక్షేమం నిమిత్తం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును 2009 లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ బోర్డు ద్వారా కార్మికులు పొందే పెళ్లి కానుకతో సహా శాశ్వత అంగ వైకల్యం, ప్రమాద మరణం, సహజ మరణం పథకాలను చంద్రన్న బీమాలో గత ప్రభుత్వం కలపడం జరిగిందన్నారు.
"కరోనా సంక్షోభం పేరుతో సంక్షేమ పథకాలను హోల్డ్‌లో పెట్టడం సరికాదు" వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని వైయస్ఆర్ బీమాగా పేరు మార్చటం జరిగిందన్నారు. మార్చి 2020 ఏప్రిల్ 2 నుండి జరిగే భవన నిర్మాణ కార్మికుల పిల్లల వివాహానికి ఇచ్చే బహుమతిని 1 లక్షకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్యులు జారీ చేసిందన్నారు. అయితే కరోనా సంక్షోభం మొదలైన తరువాత పెళ్లి కానుకను ప్రభుత్వం హోల్డ్ చేసింది. దీని ద్వారా అనేక మంది భవన నిర్మాణ కార్మికులు తమ పిల్లల పెళ్లిళ్లలకు వచ్చే కానుక రాకపోవటంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటేనే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. లాక్ డౌన్ సమయంలో జరిగిన పెళ్లిళ్లతో పాటుగా ప్రమాద, సహజ, శాశ్వత అంగవైకల్య పరిహారాలను భాదితులకు తక్షణమే అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
"కరోనా సంక్షోభం పేరుతో సంక్షేమ పథకాలను హోల్డ్‌లో పెట్టడం సరికాదు" ఇవీ చదవండి