సీఎం జగన్ బయటకు వస్తే కరోనా తీవ్రత ఎలా ఉందో తెలుస్తుందని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. లాక్డౌన్తో బాధలు పడుతున్న ప్రజల్ని వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబు బయటకు రావటం లేదంటున్న వైకాపా నేతలు.. సీఎం జగన్ ఎప్పుడు బయటకు వచ్చి తిరిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్ ఇంట్లోనే ఉన్న చంద్రబాబు.. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, తగిన సూచనలు చేస్తున్నారన్నారు. సమీక్షలు చేస్తున్న జగన్.. కనీసం మీడియా ముందుకు రావడం లేదని విమర్శించారు.
ఇదీ చదవండి: