పుష్కరఘాట్లో ఘనంగా వీరభద్రస్వామి సంబరాలు - veerabhadraswami celebration in rajamahendravaram
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వీరభద్రస్వామి సంబరాలు ఘనంగా జరిగాయి. పుష్కరఘాట్‌లోని ఆలయంలో వీరభద్రుని ప్రతిష్ఠించిన రోజైన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. భక్తులు వీరభద్రుని ప్రతిమలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా డప్పు వాయిద్యాల నడుమ నగర వీధుల్లో తిరిగారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.