నాలుగు రోజుల క్రితం గోదావరి వరద ఉధృతికి తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలి పాలెం సమీపంలోని కాజ్వే మునిగిపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక గ్రామ ప్రజలు తూర్పుగోదావరి జిల్లా చాకలి పాలెం వైపు రావడానికి చాల ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం గోదావరి శాంతించడంతో రెండు గ్రామల మద్య మళ్ళి రాకపోకలు ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం ఉన్న కాజ్వే శిధిలావస్థకు చేరుకుందని కొత్త కాజ్వేను ఎత్తుగా నిర్మించాలని లంక గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే.. ఉభయగోదావరి జిల్లాల ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: