ఎగువన కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని ఏలేరు జలాశయం నీటి మట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 15 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. నీటి ఉద్ధృతికి ఏలేరు కాలువను అనుకోని ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు నేలమట్టం అవుతున్నాయి. కాలువలో కొట్టుకుంటూ వచ్చి వంతెనను ఢీ కొడుతున్నాయి. ఈ కారణంగా వంతెన కుంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: గతంలో కోర్టుకు డీజీపీ హాజరైనా పరిస్థితి మారలేదు: హైకోర్టు