BJP LEADER SATYAKUMAR: ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఏప్రిల్, మే నెలల్లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చెప్పారు. ఎన్నికలంటే యుద్ధమని అభివర్ణించిన జగన్.. ముందుస్తు ఎన్నికలకు అన్ని సాధన సంపత్తిని సమకూర్చుకుంటున్నారని ఆరోపించారు. ఇంకా కొనసాగితే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంటుందో తనకు తెలుసని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.100 కోట్లు కుమ్మరించైనా నెగ్గి.. ఆ తర్వాత సాధారణ ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. రాజకీయాల్లో భాగంగానే.. ఆంధ్రప్రదేశ్తో తెలంగాణ కలుస్తుందన్న వ్యాఖ్యలు చేశారని సత్యకుమార్ చెప్పారు.
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా : పాలన చేయమని అధికారమిస్తే.. గర్జనల పేరిట ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. బీసీల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అబద్ధపు ప్రకటనలు, మాటలతో మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. వాస్తవ ఖర్చులకు, ప్రభుత్వం చూపుతున్న లెక్కలకు పొంతన లేదని ఆరోపించారు. బీసీలకు సంబంధం లేని వివిధ రంగాలకు ప్రభుత్వం పెట్టిన ఖర్చులన్నింటినీ వారి ఖాతాలో లెక్కలు చూపుతున్నారని చెప్పారు. ఏడాదికి 6 వేల కోట్ల రూపాయలు మాత్రమే బీసీలకు ఖర్చు చేశారని తెలిపారు. రాజకీయ వేదికలపై బీసీలు 50 నుంచి 60 శాతం వరకు అని చెబుతున్నారు.. కానీ లబ్దిదారులకు సంబంధించి 43.17 శాతం మాత్రమే ప్రభుత్వం నివేదికలో పొందుపరిచిందన్న విషయాన్ని జనం గమనించాలని సత్యకుమార్ అన్నారు.
ఇవీ చదవండి: