శ్రీకాకుళం జిల్లా పలాసలో స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు ప్రకటించడంపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలో నిర్వహించిన సమావేశంలో తెలుగు జనతా పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంత్రి వ్యాఖ్యలు బలహీన వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. మంత్రి అప్పలరాజు తక్షణం క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతామని హెచ్చరించారు.
ఇదీచదవండి.