ETV Bharat / state

కొత్తపేట కెనరా బ్యాంకులో.. మరో 20 కాసుల బంగారం మాయం!

కొత్తపేట కెనరా బ్యాంకు శాఖలో నగదు, బంగారు ఆభరణాలను అక్కడి అటెండర్ చోరీ చేయడంపై విచారణ కొనసాగుతుండగానే.. మరో వ్యవహారం బయటపడింది. ఇంకో 20 కాసుల బంగారు ఆభరణాలు లేనట్టు అధికారులు గుర్తించారు. బ్యాంకు మేనేజర్ పోలీసులకు మరోమారు ఫిర్యాదు చేశారు.

bank robbery in in kothapet
bank robbery in in kothapet
author img

By

Published : Dec 12, 2020, 8:03 AM IST

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట కెనరా బ్యాంకులో నగదు, బంగారు ఆభరణాలు మాయమైన ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈనెల 7న మధ్యాహ్నం సిబ్బంది భోజనానికి వెళ్లిన సమయంలో క్యాషియర్‌ క్యాబిన్‌లో ఉన్న రూ.9.23 లక్షలు, ఆ రోజు తాకట్టుకు వచ్చిన 322 గ్రాములు బంగారం మాయమయ్యాయి. తాత్కాలిక ఉద్యోగి లేకపోవడం, సీసీ కెమోరాలను అతనే ఆఫ్‌ చేయడంతో అనుమానం వచ్చి బ్యాంకు మేనేజరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ కొనసాగుతోంది.

ఈ క్రమంలో బ్యాంకులోని రికార్డులు, గతంలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు ఉన్నాయా లేవా అనే కోణంలో తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. ఓ ఖాతాదారుడికి సంబంధించి 20 కాసుల బంగారు ఆభరణాల సంచి లేనట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలిసింది. ఈ విషయంపై బ్యాంకు సిబ్బంది శుక్రవారం కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ వి.కృష్ణను వివరణ కోరగా బ్యాంకు సిబ్బంది శుక్రవారం స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. ఎస్సై విజయవాడ వెళ్లిన కారణంగా శనివారం తాము వెళ్లి విచారణ చేస్తామని చెప్పారు.

సంబంధిత కథనం:

బ్యాంకులోని నగదు, ఆభరణాలతో అటెండర్​ పరారీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.