తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. అభ్యర్థులు ప్రచారంపై దృష్టిపెట్టగా.. అధికారులు ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి మండలాల వారీగా అవసరమైన బాక్సులను ఇప్పటికే పంపిణీ చేశారు. మరమ్మతులకు గురైన వాటిని పక్కనపెట్టి ఉపయోగకరంగా ఉండే వాటిని శుభ్రం చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో ఎక్కువగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చినవే కాగా.. మండల స్థాయి రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది బాక్సులను సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చదవండి: కర్నూలులో ఎంపీపీ స్థానం రూ.కోటి?