సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో 80 శాతం పోలింగ్ నమోదైంది. ఈ విషయాన్నని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా అనపర్తిలో 87.48 శాతం.. అత్యల్పంగా రాజమహేంద్రవరం నియోజకవర్గం 66.34 పోలింగ్ నమోదైనట్లు తెలిపారు.
రెండు గంటల ముందే పోలింగ్...77.73 శాతం పోలింగ్
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో పోలింగ్ సమయానికంటే రెండు గంటలమందే ముగిసినప్పటికీ 77.73 శాతం పోలంగ్ నమోదవడం విశేషమని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 450 ఈవీఎంలు మొరాయించాయని.. వాటి స్థానంలో అదనంగా ఈవీఎంలు అమర్చామని తెలిపారు. ఎన్నికలు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్పీ విశాల్ గున్నీ, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోషీ భాజపాయ్, పోలీస్ సిబ్బందికి అభినందించారు.