రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా పెరగటంతో వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తెచ్చి లాభాలు పొందుతున్నారు. మరికొంతమంది నాటుసారాను తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో నాటు సారా తయారీ కేంద్రాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. వెలిచేరులోని గోదావరి ఇసుక తిప్పలో దాచి ఉంచిన 7 వేల 400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
ఇవీ చదవండి