తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ సమీపంలో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తోడేస్తున్న వైనంపై అధికారులు స్పందించారు. గాయత్రి-4 ఇసుక ర్యాంపును ఎస్ఈబీ ఏఎస్పీ రమాదేవి పరిశీలించారు.
ఇసుక తవ్వకాలపై సొసైటీ సభ్యుల్ని ఆరా తీశారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో కలిసి గోదావరిలో పర్యటించారు. ఈ బృందం వచ్చే సరికే ర్యాంపు వద్ద డ్రెడ్జింగ్ కు సంబంధించిన ఇంజిన్లు, గొట్టాలు అమర్చిన పడవలను అక్రమార్కులు తరలించారు. దీనిపై మాట్లాడేందుకు ఏఎస్పీ రమాదేవి నిరాకరించారు.