Argument between YSRCP, Janasena leaders: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం తొర్రేడులో వైకాపా, జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. 'జగనన్న ఇళ్లు - పేదలకు కన్నీళ్లు' పేరిట మూడో రోజు జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేన నేతలు తొర్రేడులో పర్యటించారు. గ్రామ సచివాలయం వద్ద వివరాలు సేకరించేందుకు వెళ్లారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన వివరాలివ్వాలని గ్రామ కార్యదర్శి, సిబ్బందిని అడిగారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానిక వైకాపా నాయకులు కలుగజేసుకొని వివరాలు ఇవ్వొద్దని సిబ్బందికి సూచించారు. జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వైకాపా నేతలు తమపై దాడికి యత్నించినట్లు జనసైనికులు మండిపడ్డారు. పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.
ఇవీ చదవండి: