తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో ప్రయోగాత్మక దర్శనాలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు దేవస్థానం ఉద్యోగులు, అన్నవరం గ్రామస్థులకు మాత్రమే దర్శన అవకాశం కల్పిస్తారు. భక్తుల వివరాలు రిజిస్టర్ చేసి, థర్మల్ స్కాన్ చేసి.. స్లిప్ ఇచ్చి కొండపైకి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం ఉండేలా, పకడ్బందీగా ఏర్పాట్లు చేసి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 10 నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు అనుమతించనున్నారు.
ఇది చదవండి 'ఈ పరిస్థితిలో వ్యాపారం చేయలేం'