ETV Bharat / state

అన్నవరంలో ఈ నెల 23 వరకు దర్శనాలు నిలిపివేత

ఈ నెల 23 వరకు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

author img

By

Published : Aug 12, 2020, 7:49 PM IST

annavaram temple darshan closes due to corona
దర్శనాలు నిలిపివేత

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం సత్యనారాయణ స్వామి దర్శనాలు ఈ నెల 23 వరకు నిలిపివేస్తున్నట్లు ఈవో త్రినాథరావు తెలిపారు. ఆలయంలో వివిద విభాగాల్లో పని చేస్తున్న అధిక శాతం ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకిందనీ చెప్పారు.

గ్రామంలో సైతం వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. అందువల్లే దర్శనాలు నిలుపుదల చేస్తున్నామని.. స్వామి వారికి నిత్యం జరిగే ఆర్జిత సేవలన్నీ ఏకాంతంగా నిర్వహించనున్నామని తెలిపారు. పూజలకు భక్తలు ఆన్​లైన్ ద్వారా రుసుము చెల్లించి పరోక్షంగా పాల్గొనవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి:

ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు.. నీట మునిగిన వందలాది ఎకరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.