తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం పి. చామవరం గ్రామంలోని చెరువు వద్ద గల గంగమ్మ తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పడగొట్టారు. అన్నవరం ఎస్సై రవికుమార్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. విగ్రహాల ధ్వంసం సరైన పద్ధతి కాదని ఎస్సై స్థానికులకు చెప్పారు. నియోజకవర్గంలో వరుసగా విగ్రహాలు ధ్వంసం చేయటంపై భాజపా శ్రేణులు నిరసన తెలిపాయి. హిందూ ఆలయాలపై దాడిని పలువురు ఖండించారు.
ఇదీ చదవండి: వ్యక్తిగత కక్షలతో వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేస్తున్నారు: చంద్రబాబు