ఇదీ చదవండి:
అనపర్తిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - ANAPARTHI ZPHS 1962-63 SSLC BATCH
అనపర్తి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1962 - 63లో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు జీబీఆర్ కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అనపర్తిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని శ్రీరామరెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1962 - 63 లో ఎస్ఎస్ఎల్సీ చదివిన పూర్వ విద్యార్థులు జీబీఆర్ కళాశాలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడినా బాల్య స్నేహితులను చూడగానే చిన్న పిల్లల్లా మారి ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను స్మరించుకుంటూ మృతి చెందిన తమ స్నేహితులకు నివాళులర్పించారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, తన ఉన్నతికి మార్గం సుగమం చేసిన పాఠశాల అభివృద్ధి కోసం విరాళాలు అందజేశారు.
ఇదీ చదవండి:
రంపచోడవరంలో గిరిజన బాలికపై అత్యాచారం