కరోనా నివారణకు "అనపర్తి రామకృష్ణ సేవా సమితి" అందిస్తున్న సేవలు అభినందనీయమని అనపర్తి ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి స్వామి వివేకానంద సెంటర్లో రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. రామకృష్ణ సేవా సమితి సమకూర్చిన లక్ష రూపాయల విరాళాన్ని రాజమహేంద్రవరం శ్రీ రామకృష్ణ మఠం అధ్యక్షుడు నిశ్చలానందజీ మహారాజ్‌కు అందజేశారు.
కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు దాతల విరాళాలు ఉపయోగపడుతున్నాయని నిశ్చలానందజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ సభ్యుడు దుర్గాప్రసాద్, రామకృష్ణ సేవా సమితి సభ్యులు వెంకట రెడ్డి, సుందర రామారెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి,సురేంద్రరెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి: