కేంద్ర పాలిత యానాంలో అంబేడ్కర్ విజ్ఞాన భవన్.. ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి బుధవారం ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలతో నిర్మాణపనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో కొలువులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇందులో చేశారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఐదు కోట్ల వ్యయంతో విజ్ఞాన భవన్ నిర్మించారు. అంబేద్కర్ 125 వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం భవనాన్ని నిర్మించింది. సాధారణ పోటీ పరీక్షల నుండి సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమయ్యే వారందరికీ.. ఈ విజ్ఞాన భాండాగారం ఎంతగానో ఉపకరిస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి బళ్లారి కృష్ణారావు తెలిపారు.
ఇదీ చదవండి: