తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ఆగమ పాఠశాల పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలను త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవస్థానం ఈవో త్రినాథరావు, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పనులను పరిశీలించారు.
2016లో సుమారు రూ.2.80 కోట్లతో సత్యగిరిపై ఆగమ పాఠశాల నిర్మాణం ప్రారంభించారు. పలు వివాదాలు, ఇతర కారణాలతో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా.. విద్యుత్, రహదారులు, రక్షణ గోడ పనులు అవ్వాల్సి ఉంది. దీనిపై ఇటీవల దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి అసంతృప్తి వ్యక్తం చేశారు. 3 నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో పనులు పూర్తిచేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి..