తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం భీమనపల్లి పంచాయతీలోని సుధాపాలెం గ్రామానికి చెందిన రాజకీయ కురువృద్ధుడు.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శిరంగు కుక్కుటేశ్వర రావు వయోభారంతో మృతి చెందారు. 90 సంవత్సరాలు కలిగిన ఈయన గ్రామ సర్పంచిగా రెండు పర్యాయాలు పని చేశారు. అనంతరం అమలాపురం సమితి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. డీసీసీబీ ఛైర్మన్ హోదాలో తూర్పుగోదావరి జిల్లాలో సహకార రంగానికి పలు సేవలు అందించారు. తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా కుక్కుటేశ్వర రావుకు మంచి పేరు పొందారు.
ఇదీ చదవండీ.. Notice: పరీక్షలు రద్దు చేయని ఏపీ సహా 4 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు