ETV Bharat / state

తూర్పుగోదావరిలో వింత.. వినాయకుడి ఆకారంలో కుక్క పిల్ల జననం - తూర్పుగోదవరి జిల్లాలో వింత కుక్కపిల్ల

తూర్పుగోదావరి జిల్లా(East Godavari district) కాట్రావులపల్లిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఒక శునకం నాలుగు పిల్లలకు జన్మనివ్వగా.. అందులో ఒక పిల్ల వినాయకుడి రూపంలో (Puppy born in the form of Ganesha)పుట్టింది. ఈ వింతను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.

A puppy
A puppy
author img

By

Published : Oct 11, 2021, 12:49 PM IST

Updated : Oct 11, 2021, 1:57 PM IST

తూర్పుగోదావరి జిల్లా(East Godavari district) జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన ధనికొండ నరసయ్య, అన్నవరం దంపతులు రెండు సంవత్సరాల నుంచి ఓ కుక్కను పెంచుకుంటున్నారు. ఆ శునకం ఈ సారి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఓ పిల్ల.. తొండం, పెద్ద చెవులతో వినాయకుడి ఆకారంలో(Puppy born in the form of Ganesha) పుట్టింది.

సాక్షాత్తూ వినాయకుడే తమ ఇంటిలో జన్మించాడని యజమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి.. తమ ఇంటి వద్ద వినాయకుడి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నామని, కానీ.. అనివార్య కారణాల వల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయామన్నారు. ఇప్పుడు సాక్షాత్తూ వినాయకుడే తమ ఇంట్లో వెలిశాడంటూ ఆనందం వ్యక్తంచేశారు. వినాయకుడి ఆకారంలో పుట్టిన కుక్కపిల్లను చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు.

ఇదీ చదవండి

Rice Millers Association: రైస్‌ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వీరభద్రారెడ్డి

Last Updated : Oct 11, 2021, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.