కరోనా ప్రభావంతో పండుటాకులు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో చెప్పడానికి ఈ సంఘటన ఒక మచ్చుతునక. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి వద్ద వైనతేయ నదిలోకి దూకి చిలారపు సత్యవతి (75) శనివారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు ఆమెను గమనించి రక్షించి ఒడ్డుకు చేర్చారు. వృద్ధురాలిది ముమ్మిడివరం మండలం క్రాప చింతలపూడిపాలెం గ్రామం.
తన భర్త గతంలో చనిపోవడం, పిల్లలు ఎవరూ లేకపోవడంతో చాలా కాలంగా ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించానని ఆమె తెలిపారు. కరోనా కారణంగా ఆదరణ కరవైందని పేర్కొన్నారు. భోజనం చేద్దామని అప్పన్నపల్లిలోని వెంకన్న ఆలయానికి వెళ్లానని, అది మూసి ఉండడంతో వెనుదిరిగి ఇలా నది ఒడ్డుకు వచ్చానని వాపోయారు. పి.గన్నవరం మండలం నాగుల్లంకలోని వృద్ధాశ్రమంలో ఆమెను చేర్పించినట్లు ఇన్‌ఛార్జి ఎస్సై శశాంక తెలిపారు.
ఇదీ చదవండి: