Vehicle Challan: ఓ ద్విచక్రదారునికి 47 చలానా బిల్లులు పెండింగ్ ఉన్న ఘటన.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వెలుగు చూసింది. చలానాలు పెండింగ్ చూసి ట్రాఫిక్ పోలీసులే అవాక్కయ్యారు.
కాకినాడలోని ఎంఎస్ఎన్ చార్టిస్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఆర్ఎస్సై ఉదయ్ భాస్కర్ ఓ ద్వి చక్ర వాహనాన్ని ఆపి తనిఖీలు చేయగా.. 47 పెండింగ్ చలానాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా వారు ఖంగుతిన్నారు. ఆ వాహనదారుడికి అవగాహన కల్పించి 6వేల 400 రూపాయల పెండింగ్ చలానాలను కట్టించి.. రసీదులను అందించారు. సుమారు 40 అడుగుల పొడవున్న రసీదులను చూసి అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇదీ చదవండి: