తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి 130వ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి ఆవిర్భావ వేడుక సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకాలు, ఆయుష్య హోమం, వెండి రథోత్సవం తదితర కార్యక్రమాలు రేపు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరిమిత సంఖ్యలో వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో స్వామి వారి సన్నిధిలోనే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫల, పుష్ప సేవలు రద్దు చేశారు.
ఇదీ చూడండి