ETV Bharat / state

TTD CHAIRMAN: తితిదే ఛైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డి నియామకం

yv subbareedy
వైవీ సుబ్బారెడ్డి
author img

By

Published : Aug 8, 2021, 1:06 PM IST

Updated : Aug 8, 2021, 7:00 PM IST

13:01 August 08

వైవీ సుబ్బారెడ్డిని తితిదే ఛైర్మన్​గా నియమించిన ప్రభుత్వం

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్​గా వైకాపా సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి రెండోసారి నియమితులయ్యారు. మళ్లీ ఆయన్ను తితిదే ఛైర్మన్​గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తితిదే బోర్డు పదవీకాలం ఇటీవలే ముగియగా..కొత్త పాలకమండలి ఏర్పాటు కోసం కొన్నాళ్లుగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండోసారి తితిదే బోర్డు ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి విముఖత చూపడంతో మరొకరి నియామకం కోసం కసరత్తు జరిగింది. బోర్డు లేకపోవడంతో దేవస్థానంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం సహా కార్యకలాపాల కోసం ప్రత్యేక వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలోకి వస్తారని, లేదంటే రాజ్యసభ ఎంపీగా ఢిల్లీ వెళ్తారనే ప్రచారమూ వైకాపాలో విస్తృతంగా జరిగింది. ఈ పదవులు వచ్చేసరికి మరికొంత సమయం పడుతుండటం..ఇదే సందర్భంలో తితిదే ఛైర్మన్ పీఠానికి పోటీ ఎక్కువగా రావడంతో తితిదే ఛైర్మన్ నియామకంపై సీఎం పునరాలోచనలో పడ్డారని తెలిసింది. 

ప్రస్తుత పరిస్థితుల్లో తితిదే ఛైర్మన్ పీఠానికి వైవీ సుబ్బారెడ్డినే తిరిగి నియమిస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చిన సీఎం వైఎస్ జగన్.. ఆయనకే రెండోసారి తితిదే ఛైర్మన్ పీఠం కట్టబెట్టారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రెండేళ్లపాటు వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్​గా కొనసాగనున్నారు. పాలక మండలి సభ్యుల నియామకంపైనా సీఎం జగన్ దృష్టి పెట్టారు. త్వరలోనే బోర్డు సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ప్రకటించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ఇదీ చదవండి

శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో దుర్గా స్టాలిన్

Last Updated : Aug 8, 2021, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.