ఆస్తి కోసం సొంత అన్న అని చూడకుండా.. రాడ్తో కొట్టి చంపాడో తమ్ముడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డి పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన నారాయణ, శివప్ప అన్నా, తమ్ముళ్లు. ఆస్తి కోసం గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలోనే గొడవ మరింత పెద్దది కావటంతో.. నారాయణను శివప్ప రాడ్తో తలపై కొట్టాడు. తీవ్రగాయాలపాలైన నారాయణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: